Pathaan: "పఠాన్" సినిమాని ఏ హీరో బ్రేక్ చేస్తాడు?

by Prasanna |
Pathaan: పఠాన్ సినిమాని ఏ హీరో బ్రేక్ చేస్తాడు?
X

దిశ,వెబ్ డెస్క్ : ఇండియాలో రూ.1000 కోట్ల క్లబ్ అనేది ఓ అరుదైన రికార్డుగా భావిస్తారు. పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ఈ మార్కును క్రాస్ చేసాడు. ఈ రికార్డును బ్రేక్ చేసే సత్తా ఏ హీరోకి ఉంది. బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 7,700 స్క్రీన్స్ లో విడుదలైన పఠాన్ వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి ధుమ్ము దులిపేసింది.

ఈ సినిమా రికార్డు చేసే లిస్టులో అల్లు అర్జున్, ప్రభాస్ పేర్లు బాగా వినబడుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్ మూడు ప్రాజెక్ట్లు రెడీగా పెట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ వెయ్యి కోట్ల మార్కును టచ్ చేయడం గ్యారంటీని అని వినిపిస్తుంది. ప్రభాస్ తరవాత ఈ రికార్డును బ్రేక్ చేసే సత్తా అల్లు అర్జున్‌కె ఉందంటూ ఆ ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Advertisement

Next Story