Pathaan Movie: "పఠాన్" కు అంత సీను లేదంటున్న బాహుబలి టీం

by Prasanna |   ( Updated:2023-03-06 02:49:26.0  )
Pathaan Movie: పఠాన్ కు అంత సీను లేదంటున్న బాహుబలి టీం
X

దిశ,వెబ్ డెస్క్ : పఠాన్ సినిమా అనుకున్నది సాధించింది. ఎన్నో విమర్శల మధ్య సినిమాని విడుదల చేసి బాలీవుడ్ పనైపోయిందనుకున్న సమయంలో మళ్లీ తలెత్తుకునేలా చేసింది. బాహుబలి 2 బ్రేక్ చేసిన షారుఖ్ ఇండియన్ సినిమాలకుఎలాంటి ఛాలెంజ్ విసిరాడో ఇక్కడ చూద్దాం.

అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనుకున్నారు ? కానీ సినిమా విడుదలై ఎన్నోరికార్డులను బ్రేక్ చేస్తూ ఐదు వారాలైనా సినిమా మాత్రం సినిమా అదే రేంజులో దూసుకెళ్తుంది. మొదటి షో కె సినిమా బోల్తా కొట్టిందనే టాక్ నుంచి రూ.వెయ్యి కోట్ల గ్రాస్ రాబట్టింది. పఠాన్ సినిమా హిందీలో హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. 28 రోజుల్లోనే 500 కోట్ల నెట్ షేర్ సాధించిన మొదటి హిందీ సినిమాగా నిలిచింది. పఠాన్ 38 రోజుల్లో రూ.511 కోట్లను సాధించి సెన్సేషన్ క్రియోట్ చేసింది. ఈ సినిమా తరవాత బాహుబలి 2 , కేజిఎఫ్ 2, దంగల్ ఉన్నాయి. బాహుబలి 2 సినిమా ఫుల్ రన్లో రూ. 900 కోట్లకు పైగా షేర్ సాధించింది. పఠాన్ సినిమా ఇండియా వైడ్ చూసుకుంటే రూ. 528 కోట్ల షేర్ అందుకుంది. బాహుబలి షేర్ ను బ్రేక్ చేయాలంటే ఇంకా రూ.370 కోట్ల మేర వసూలు చేయాలిసింది ఉంది. ఇది జరిగే పని కాదని,హిందీ వరకు మాత్రం ఈ రికార్డు చెప్పుకోవడానికి పనికివస్తుందని నెటిజెన్స్ కామెంట్స్ చేసారు.


ఇవి కూడా చదవండి :

ఏ.ఆర్ రెహమాన్ కుమారుడికి తప్పిన పెను ప్రమాదం

Advertisement

Next Story