ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా.. వైరల్ పిక్స్

by Prasanna |   ( Updated:2023-09-26 07:00:51.0  )
ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటైన పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా.. వైరల్ పిక్స్
X

దిశ, సినిమా: ఎట్టకేలకు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపి రాఘవ్ చద్దాలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పలువురు రాజకీయ నాయకులు, అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తరలి రావడంతో పెళ్లి మండపం కళకళలాడింది. ఇక ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు రాఘవ్ చద్దా తన ట్వీట్ ద్వారా పంచుకుని వారి ఇద్దరి ప్రేమ ఎలా మొదలైందో తెలిపాడు. ‘అల్పాహారం టేబుల్ వద్ద మొదటి చాట్ నుంచి మా హృదయాలు ఒక్కటయ్యాయి. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న. ఎట్టకేలకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం ఆశీర్వాదం. ఒకరికొకరు లేకుండా జీవించలేము’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed