- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బావతో రొమాన్స్ చేయబోతున్న నిహారిక.. అందరూ అనుకున్నంత పని చేస్తుందిగా?
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని.. పలు మనస్పర్థల కారణంగా డివోర్స్ తీసుకుంది. డివోర్స్ అనంతరం ఏ మాత్రం కుంగిపోకుండా నిహారిక లైఫ్ లో తన కాళ్ల మీద తను నిలబడాలని నిర్మాతగా మారింది. ప్రస్తుతం సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది.
తాజాగా ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త దుమారం సృష్టిస్తుంది. నిహారిక అండ్ పంజా వైష్ణవ్‌తేజ్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. కొత్త డైరెక్టర్ వీళ్లిద్దరి కలయికలో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీని డిజైన్ చేశారట. పైగా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. ఈ మూవీ ట్రూ లవ్ బేస్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. నిహారిక-వైష్ణవ్ నటించబోయే సినిమా రాధే శ్యామ్ సినిమా రేంజ్లో హిట్ కొట్టనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.
ఈ వార్త విన్న నెటిజన్లు నిహారికపై దారుణంగా ఫైర్ అవుతున్నారు. విడాకులు తీసుకుని నెట్టింట ఇప్పటికి ట్రోల్స్ ఎదుర్కున్నది చాలు. ఇంకా బావతో రొమాన్స్ చేసి.. మెగా పరువు తీస్తావా? ఇలాంటి చిత్రాల్లో నటించడం అవసరమా? అందరూ అనుకున్నంత పని చేస్తున్నావ్ గా అంటూ నెటిజన్లు మెగా డాటర్ పై దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై నిహారిక కానీ వైష్ణవ్ కానీ స్పందించలేదు.