బిగ్‌బాస్‌ సీజన్ -7 విజేత పల్లవి ప్రశాంత్

by GSrikanth |   ( Updated:2023-12-17 17:38:29.0  )
బిగ్‌బాస్‌ సీజన్ -7 విజేత పల్లవి ప్రశాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వీక్షించే బిగ్‌బాస్ సీజన్‌-7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఒక సాధారణ వ్యక్తిగా హౌజ్‌లోకి ఎంటరై ఏకంగా టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో ప్రశాంత్‌ను విన్నర్‌గా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా, ఈ సీజన్‌లో 20 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. ప్రశాంత్, శివాజీ, అర్జున్, యావర్, అమర్‌దీప్, ప్రియాంక టాప్-6కు ఎంపిక అయ్యారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ గ్రాండ్ ఫినాలే(టైటిల్ పోరు)లో టాప్‌-2లో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ నిలిచారు. చివరకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించారు. దీంతో అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచారు. విన్నర్‌ ప్రశాంత్‌కు రూ.35 లక్షల ప్రైజ్ మనీ, రూ.15 లక్షల విలువచేసే డైమండ్ నెక్లెస్‌తో పాటు హౌజ్‌లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. ఓవరాల్‌గా దాదాపు కోటి రూపాయల సొత్తును ప్రశాంత్ గెలుచుకున్నారు. కాగా, సుమారు 105 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను బిగ్‌ బాస్‌ షో అలరించించింది. అనేకమంది హీరోలు, హీరోయిన్లు ఈ షోలో సందడి చేశారు.







Advertisement

Next Story

Most Viewed