నీచంగా ఓటీటీలో రెచ్చిపోతూ.. యువతను నాశనం చేస్తున్న స్టార్ హీరోయిన్స్..

by Vinod kumar |   ( Updated:2023-06-17 11:43:50.0  )
నీచంగా ఓటీటీలో రెచ్చిపోతూ.. యువతను నాశనం చేస్తున్న స్టార్ హీరోయిన్స్..
X

దిశ, సినిమా: కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీ సంస్థలకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో నంబర్ ఆఫ్ ప్లాట్ ఫామ్స్ పుట్టుకొచ్చాయి. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు హద్దులు మీరుతున్నాయి. స్టార్ సెలబ్రిటీలు సైతం స్వేచ్ఛ వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై ఎంతో పద్ధతిగా కనిపించిన హీరోహీరోయిన్లు సైతం బూతులు మాట్లాడుతూ.. శృంగార సన్నివేశాల్లో నటించి షాక్ ఇస్తున్నారు.

దీంతో ‘నటీనటుల్లో ఉన్న విచక్షణా జ్ఞానం లేదా? డబ్బులిస్తే ఎంతకైనా దిగజారుతారా..? మీ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఇదేనా?’ అని జనాలు తిట్టిపోస్తున్నారు. ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ బూతులు మాట్లాడటం చూసి.. ఎంతో పద్ధతిగా ఉన్న మా హీరోని సైతం ఇలా మార్చేశారు ఏంటి?’ అంటూ ఆయన అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అలాగే కియరా అద్వానీ నుంచి నిన్నటి సమంత, తమన్న వరకు అంతా బోల్డ్ పేరిట చండాలంగా నటించారు. దీని బట్టి చూస్తే మొత్తానికి అభ్యంతరకరమైన సన్నివేశాలు, బూతులు లేకుండా సిరీస్‌లు చేయకూడదని ఓటీటీ నిర్మాతలు అయ్యారా ఏంటి? అనిపిస్తోంది.

Read More: స్టార్ హీరోయిన్ సంచలన నిర్ణయం...?

ఆమె నాకు పుట్టలేదు.. చెత్త కుండీ దగ్గర దొరికితే పెంచుకున్నా: మిథున్

Advertisement

Next Story