ఎన్టీఆర్‌పై 'ఊసరవెల్లి' నటి కామెంట్స్.. నేను తప్పుకానంటూ..

by Disha News Desk |
ఎన్టీఆర్‌పై ఊసరవెల్లి నటి కామెంట్స్.. నేను తప్పుకానంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్రండ్ అయిపోయింది. తన పాన్ ఇండియా సినిమా విడుదల కాకుండానే ఎన్‌టీఆర్ పాన్ ఇండియా స్టార్ హోదాను అందుకున్నాడు. అంతేకాదు పాన్ ఇండియా ఫ్యాన్ బేస్‌ కూడా ఎన్‌టీఆర్ సొంతమైంది. అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్‌తో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సైతం రెడీ అవుతున్నారు. ఇదే విధంగా దీపికా పదుకొణె తన మనసులో మాట చెప్పేయగా.. మరికొందరు కూడా ఇదే తరహాలో మాట్లాడారు.

దీనిపై తాజాగా 'ఊసరవెల్లి' నటి స్పందించింది. 'ఊసరవెల్లి' మూవీలో తమన్నా స్నేహితురాలి పాత్రలో నటించిన పాయల్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను అప్పుడే చెప్పానని, కానీ ఎవరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. 'నేను అప్పుడే చెప్పాను. ఎన్‌టీఆర్ నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే అని, బాలీవుడ్‌ని టాలీవుడ్ దాటేస్తుందన్నాను కానీ అందరూ నన్ను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే నిజమవుతోంది. నేను ఎప్పటికీ తప్పకాను' అంటూ ట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.


Advertisement

Next Story