ప్రజెంట్ బ్యాచ్‌లో సమంత మాత్రమే మహానటి అవ్వగలదు : Allu Aravind

by samatah |   ( Updated:2022-12-15 07:03:29.0  )
ప్రజెంట్ బ్యాచ్‌లో సమంత మాత్రమే మహానటి అవ్వగలదు : Allu Aravind
X

దిశ, సినిమా: బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు అన్‌స్టాపబుల్ సీజన్ 2కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సీజన్ 2లో ఇప్పటి వరకు 4 ఎపిసోడ్ వచ్చాయి. తాజాగా 5వ ఎపిసోడ్‌లో మాత్రం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో పాటు స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబుతో పాటు మరో ఇద్దరు సెలబ్రిటీలు ఈ షో లో సందడి చేశారు. అందులో బాలయ్య ఓ ప్రశ్న వేశాడు. ఈ తరం హీరోయిన్లలో మహానటి రేంజ్‌కు వెళ్లగల స్థాయి ఉన్న వారు ఎవరు? అని అడిగాడు. అల్లు అరవింద్, సురేష్‌ బాబు ఇద్దరూ కూడా సమంత పేరు రాశారు. అనుకోకుండా ఇద్దరం ఒకే పేరు రాశామని అల్లు అరవింద్ ఎగ్జైట్ అయ్యాడు. ఇక సురేష్‌ బాబు అయితే సమంతను ఆకాశానికి ఎత్తేశాడు. '' ప్రజెంట్ బ్యాచ్‌లో సమంత మాత్రమే మహానటి అవ్వగలదు'' . ఈ మాట అన్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మహానటి సమంత అంటూ ఆమె ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Also Read.......

ఆ హీరోను రేప్ చేస్తానన్న స్టార్ హీరోయిన్.. అసలు రహస్యం ఏమిటంటే?

Advertisement

Next Story