మరోసారి గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

by Disha Web Desk 7 |
మరోసారి గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
X

దిశ, సినిమా: డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే.. ఈయన గొప్ప మనసు గురించి అందరికి తెలిసిందే. అనాధ పిల్లలకు, ఎంతో మంది అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా తనకు చేతనైన సాయం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన వికలాంగులకు బైక్స్ పంపిణి చేశారు. అయితే.. నిజానికి వికలాంగులు ఉండటానికి సరైన ఇళ్లు లేక ఇబ్బంది పడుతుంటే.. ఇళ్లు కట్టిస్తానని, బైక్స్ పంపిణి చేస్తానని రాఘవ లారెన్స్ గతంలో మాట ఇచ్చాడు. అన్నట్లు గానే ఆ మాట నెరవేర్చారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేస్తూ.. ‘హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్‌లో నా శారీరక సామర్థ్యం ఉన్న అబ్బాయిలు చాలా ధైర్యంగా మల్లరకంభం ప్రదర్శించారని చెప్పాను. వారి సంకల్పం, కృషిని చూసి నేను చాలా గర్వ పడ్డాను. ఆ సంతోషంలో వారికి బైక్‌లు అందజేస్తానని, ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాను. మొదటి దశగా, 13 బైక్‌లను అందజేస్తానని నా వాగ్దానం ఈ రోజు నెరవేరింది. అంతే కాకుండా అన్ని బైక్‌లను త్రీ వీలర్‌లుగా మారుస్తాము. వారికి ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఇళ్లు కట్టిస్తాను. ఈ ప్రత్యేకమైన రోజును మీ అందరితో పంచుకోవాలని నేను కోరుకున్నాను. మీ అందరి ఆశీస్సులు, మద్దతు నాకు కావాలి’ అంటూ షేర్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. అంతే కాదు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్లల్లో నీళ్లు రావడం పక్క. ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తున్న రాఘవ రాలెన్స్‌ను నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు జరిపించాలి అంటూ కోరుకుంటూ.. నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.


Next Story