కోహ్లీపై విమర్శలా?. విసిగిపోయా : వారిపై ఏబీ డివిలియర్స్ ఫైర్

by Harish |
కోహ్లీపై విమర్శలా?. విసిగిపోయా : వారిపై ఏబీ డివిలియర్స్ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరపున విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 147.49 స్ట్రైక్‌రేట్‌తో 500 పరుగులు చేశాడు. అయితే, అతను స్ట్రైక్‌రేట్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విరాట్‌పై విమర్శలు గుప్పించే వారిపై తాజాగా సౌతాఫ్రికా, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఫైర్ అయ్యాడు. తన యూట్యూబ్ చానెల్‌లో ఏబీడీ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా కాలంగా జరుగుతుంది. దీనిపై నేను విసిగిపోయా. క్రికెట్‌‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో అతను ఒకడు. ఐపీఎల్‌లో అతను అసాధారణ ఆటగాడు. ఆర్సీబీకి తరపున అతను నిర్దిష్ట పాత్ర పోషిస్తాడు. అయితే, అతన్ని విమర్శించే క్రికెట్ పడింతులు చాలా మంది ఉన్నారు. ఆట పట్ల వారికి సరైన అవగాహన కూడా ఉండదు. అతను ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు?. ఐపీఎల్‌లో ఎన్ని సెంచరీలు చేశాడో? కూడా వారికి తెలియదు.’ అని కౌంటర్ ఇచ్చాడు.

Advertisement

Next Story