దేవాలయంలో దర్శనం చేసుకున్నా అంటూ Om Raut పోస్ట్.. ఇంకా బతికే ఉన్నావా అంటూ నెటిజన్లు ఫైర్

by Hamsa |   ( Updated:2023-07-25 05:48:22.0  )
దేవాలయంలో దర్శనం చేసుకున్నా అంటూ Om Raut పోస్ట్.. ఇంకా బతికే ఉన్నావా అంటూ నెటిజన్లు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూన్ 16న భారీ అంచనాల మధ్య విడుదలై ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఆదిపురుష్ సినిమా దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రిలీజ్ అయి విఫలమైంది. దీంతో డైరెక్టర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల వేదికగా అతను కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు. ఎన్ని విమర్శలు ఎదురైనా ఓం రౌత్ మాత్రం స్పందించలేదు.

సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత తాజాగా, ఓం రౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ శ్రీ మాంగేశి, శ్రీ శాంతదుర్గ దేవాలయాలను దర్శనం చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా. ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటా’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో అది చూసిన నెటిజన్లు రూ. 600 కోట్లను ఆగం చేశావు.. అన్నా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి :: ‘Rocky Aur Rani Kii PremKahaani’ ఆలియా భట్ సినిమా రిలీజ్ కాకముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది?

Advertisement

Next Story