‘OG’ని భ్రష్టు పట్టించిన థమన్.. ఈ సారి కూడా కాపీ కొట్టాడుగా..

by Hamsa |   ( Updated:2023-09-02 09:32:35.0  )
‘OG’ని భ్రష్టు పట్టించిన థమన్.. ఈ సారి కూడా కాపీ కొట్టాడుగా..
X

దిశ, సినిమా: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై కాపీ ఆరోపణలు ఎన్ని సార్లు వచ్చాయో చెప్పక్కర్లేదు. మొదటి సినిమా నుంచి కూడా ఏదో ఒక రకంగా ట్రోలింగ్‌కు గురవుతున్న థమన్ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాసివ్ యాక్షన్ డ్రామా ‘ఓజి’ నుంచి విడుదలైన సాలిడ్ గ్లింప్‌ కనిపిస్తుంది. ఇక ఈ గ్లింప్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని టాక్ వచ్చినప్పటికీ, థమన్ మళ్ళీ కాపీ కొట్టి దొరికిపోయాడనే మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటికైనా మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చాలని.. ‘ఓజీ’ని భ్రష్టు పట్టిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed