Devara Movie : అమెరికాకు వెళ్తున్న ఎన్టీఆర్.. ‘దేవర’ ప్రమోషన్స్ తెలుగులో ఇక లేనట్టేనా..?

by Prasanna |   ( Updated:2024-09-23 05:11:56.0  )
Devara Movie : అమెరికాకు వెళ్తున్న ఎన్టీఆర్..  ‘దేవర’ ప్రమోషన్స్ తెలుగులో ఇక లేనట్టేనా..?
X

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ వైడ్ గా దేవర మూవీ సెప్టెంబర్ 27 విడుదల కానుంది. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా అభిమానులు అంచనా వేసిన దానికంటే చాలా మంది రావడంతో వెంటనే ఈవెంటును క్యాన్సల్ చేసారు. అయితే, దేవర మూవీకి ఒక్క తెలుగులో ఎక్కువ ప్రమోషన్స్ జరగలేదు. ప్రెస్ మీట్ కానీ, చిన్న ఈవెంట్ కానీ తెలుగు స్టేట్స్ లో చేయలేదు.

విడుదలయ్యే లోపు దేవర ప్రమోషన్స్ తెలుగులో ఒక్కసారి అయినా చేస్తారా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసారు. కానీ, వారి ఆశ నిరాశ అయింది. ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం అమెరికాకు వెళ్లిపోయారు. లాస్‌ ఏంజిల్స్ లో జరిగే ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘బియాండ్‌ ఫెస్ట్‌’ 2024 లో దేవర సినిమాని ప్ర‌ద‌ర్శించనున్నారు. దీంతో ఎన్టీఆర్ అక్కడే దేవర మొదటి షో చూడటానికి ఈ రోజు ఉదయం అమెరికాకు వెళ్ళారు.

ఎన్టీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అమెరికాకు వెళ్లిపోవడంతో ఇక తెలుగులో దేవర ప్రమోషన్స్ లేనట్టే అభిమానులు ఫిక్స్ అయ్యారు. సినిమా ఈవెంట్స్ కి తప్ప అసలు ఫ్యాన్స్ ముందుకు ఇంతవరకు రాలేదు. దేవరకి అయినా వచ్చి మాట్లాడుతాడనుకుంటే ఇలా అయిందేంటని ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు.

Advertisement

Next Story