జక్కన్న మహాభారతంలో శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు, ధర్మరాజు.. అన్నీ ఎన్టీఆర్ మాత్రమే చేస్తాడా...?

by Sujitha Rachapalli |
జక్కన్న మహాభారతంలో శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు, ధర్మరాజు.. అన్నీ ఎన్టీఆర్ మాత్రమే చేస్తాడా...?
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తాత ప్రతిభను పుణికిపుచ్చుకున్న తారక్.. ఆయనకు తగిన మనవడు అనిపించుకున్నాడు. అనిపించుకుంటూనే ఉన్నాడు. 'RRR' ద్వారా ఇంటర్నేషనల్ అప్లాజ్ అందుకోవడం ఇందుకు ఉదాహరణ. కాగా ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

కాగా ఓ ఇంటర్వ్యూలో జక్కన్న తెరకెక్కించే ' మహాభారతం ' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు యంగ్ టైగర్. ఈ కథలో శ్రీకృష్ణుడు క్యారెక్టర్ ఈ హీరోకి ఇస్తే బాగుంటుందని ప్రశ్నించగా.. ఎవరో ఎందుకు తనే అని తెలిపాడు. అర్జునుడు, కర్ణుడు, ధర్మరాజు పాత్రలు కూడా తనే చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ద్రౌపది పాత్రను అలియా భట్ కు ఇస్తానని తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 'నువ్వు అన్ని నేనే చేస్తా అని ఫన్నీగా చెప్పేవేమో కానీ ఆ పాత్రలన్నీ చేసే కేపబిలిటి నీకు ఉంది ' అని మురిసిపోతున్నారు అభిమానులు. ఒకేసారి పది పాత్రల్లో కూడా చేయగలవని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed