'NTR 30#' కోసం భారీగా డిమాండ్ చేస్తున్న జాన్వీ!

by Nagaya |   ( Updated:2023-01-08 14:05:25.0  )
NTR 30# కోసం భారీగా డిమాండ్ చేస్తున్న జాన్వీ!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, కొర‌టాల శివ కలయికలో వస్తున్న చిత్రం 'NTR 30#'. ఈ సినిమాలో మొదట అలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టించ‌బోతున్నట్లు ప్రచారం జ‌రిగినప్పటికి వ్యక్తిగత విషయాలతో ఆమె తప్పుకుంది. తర్వాత ర‌ష్మికను అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో నో చెప్పింది. దీంతో చివరగా జాన్వీక‌పూర్‌ను ఎంపిక చేసినట్లు స‌మాచారం. కాగా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడనుంది. ఇక తాజా సమాచారం ఏమిటంటే.. ఈ మూవీకోసం జాన్వీ రూ.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె డిమాండ్‌ను మూవీ యూనిట్ కూడా అంగీక‌రించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story