Kareena Kapoorతో ఆటాడేసుకుంటున్న నెటిజన్స్.. యాడ్స్ కూడా చేయొద్దని..

by srinivas |   ( Updated:2022-08-25 13:41:44.0  )
Kareena Kapoorతో ఆటాడేసుకుంటున్న నెటిజన్స్.. యాడ్స్ కూడా చేయొద్దని..
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్స్‌ను ముప్పతిప్పలు పెట్టేస్తున్నారు నెటిజన్స్. బీటౌన్ నుంచి రిలీజ్ అయిన ప్రతీ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్న ఓ వర్గం.. ఇప్పుడు సెలబ్రిటీల యాడ్స్ విషయంలోనూ అదే పద్ధతి కొనసాగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కరీనా కపూర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమాను బాయ్‌కాట్ చేసిన నెటిజన్స్.. ఇప్పుడు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మెర్సెడెస్ కారును కూడా పక్కన పెట్టాయాలని సూచిస్తున్నారు. #boycottmercedesతో ట్విట్టర్‌లో ట్రెండ్ నడిపిస్తున్నారు.

Advertisement

Next Story