రకుల్ నిర్మాతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. డబ్బు మీద వ్యామోహంతో..

by Sujitha Rachapalli |
రకుల్ నిర్మాతను పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు.. డబ్బు మీద వ్యామోహంతో..
X

దిశ, సినిమా :హాట్ బ్యూటీ నోరా ఫతేహి సినిమాలు, డ్యాన్స్ షోలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఒకప్పుడు రూ.5వేలు చేతిలో పట్టుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డ ఈ భామ.. ప్రస్తుతం కోట్లు సంపాదిస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా.. బాలీవుడ్ జంటలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సెలబ్రిటీలు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటుంది ప్రేమతో కాదని జస్ట్ డబ్బు, ఫేమ్ కోసమేనని తెలిపింది. హీరో లేదా హీరోయిన్ భాగస్వామి అయితే సర్కిల్ పెంచుకుంటారు.. తమకు పరిచయాలు పెరిగాక మూడేళ్లకు విడాకులు తీసేసుకుంటారని చెప్పింది. ఈ మ్యారేజెస్ జస్ట్ కాలిక్యులేటివ్ అని.. వన్ పర్సెంట్ కూడా లవ్ లేదని చెప్పుకొచ్చింది. అందుకే తాను డేటింగ్, మీటింగ్ అంటూ ఎవరి వెంట పడట్లేదని వివరించింది ఈ ముద్దుగుమ్మ.

కాగా అలియా భట్-రణ్‌బీర్ కపూర్,దీపికా పదుకునే-రణ్‌వీర్ సింగ్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ లాంటి సెలబ్రిటీ కపుల్స్ పెళ్లితో ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. కానీ నోరా కామెంట్స్‌తో వీరి పెళ్లిళ్ల వెనుక ఇంత స్వార్థం ఉంటుందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకునేది విడిపోయేందుకేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed