- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్లీలో పుట్టిపెరిగిన నాకు ఈ సక్సెస్ ఊరికే రాలేదు.. Nora Fatehi
దిశ, సినిమా : మోడల్, డ్యాన్సర్, సింగర్‌గా రాణించడంతోపాటు నిర్మాతగానూ సత్తా చాటుతున్న బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహీ.. తన సక్సెస్‌కు గల కారణాలను వెల్లడించింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునేందుకు చాలా కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
‘నేను ఓ చిన్న గల్లీలో పుట్టి పెరిగాను. కెనడా నుంచి ఇండియాకు వచ్చినపుడు ఇక్కడ ఎవరూ తెలియదు. సినీ బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. పేదరికం, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను జీవితంలో సక్సెస్ కావాలనే తపనతో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించాను. ప్రతి అవకాశాన్ని నా ఎదుగుదల కోసం వినియోగించుకున్నా. ఇప్పటికీ నిరూపించుకుంటున్నా. ఈ ప్రయాణంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. నా డ్యాన్స్‌ను ప్రోత్సహించిన అభిమానులు, సన్నిహితులందరికీ కృతజ్ఞతలు. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ప్రపంచంలోని అతిపెద్ద వేదికపై డ్యాన్స్ చేయాలనేది నా కోరిక’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది నోరా.