పవన్ భార్య అన్నా లెజీనోవా గురించి ఎవరికీ తెలియని నిజాలివే!

by Jakkula Samataha |   ( Updated:2024-06-14 09:59:44.0  )
పవన్ భార్య అన్నా లెజీనోవా గురించి ఎవరికీ తెలియని నిజాలివే!
X

దిశ, సినిమా : పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్నా లెజీనోవాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకార వేడుకలో అన్నా లెజీనోవో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విదేశీ వనిత అయినా అచ్చం తెలుగు మహిళలా కనిపించి, పవన్ భార్య అనిపించుకుంది. కాగా, ఆమెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజీనోవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. తర్వాత 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకొని, మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. పవన్ కళ్యాణ్‌తో ప్రేమకు ముందే ఈ నటి పెళ్లి చేసుకొని విడిపోయింది. అప్పటికీ తనకు ఒక పాప కూడా ఉంది. ఇక తర్వాత పవన్‌ను పెళ్లి చేసుకొని, ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇక ఈమె విదేశీ వనిత, రష్యాలో 1980లో పుట్టారు. యాక్టింగ్, మోడలింగ్ చేశారు. రష్యాలో ఈమెకు హోటల్ బిజినెస్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె పలు బిజినెస్‌లు రన్ చేస్తుంటారంట. ఇప్పటికీ ఈమెకు సింగపూర్ లో హోట‌ల్ చైన్స్ ఉన్నాయ‌ట‌. ర‌ష్యా, సింగ‌పూర్ లో క‌లిపి దాదాపు రూ.1800 కోట్లు విలువ‌ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: హాట్ టాపిక్‌గా పవన్ భార్య అన్నా లెజినోవా ఆస్తుల వివరాలు.. వామ్మో అన్ని వందల కోట్లు ఉన్నాయా?

Advertisement

Next Story