వాడికి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.. ఆ న్యూస్ ఛానల్‌ను బహిష్కరించండి: బండ్ల గణేష్ ట్వీట్

by Hamsa |   ( Updated:2023-05-30 08:01:46.0  )
Bandla Ganesh
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులు పెడుతుంటాడు. తాజాగా, ఓ షాకింగ్ పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. ఓ న్యూస్‌ ఛానల్‌ను బహిష్కరించాలంటూ సంచలన ట్వీట్ చేశాడు. ‘‘ఈ గ్రేట్ ఆంధ్ర వెంకీ గాడికి వాడికి సంబంధించిన దానికి దయచేసి ఎవరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలు మన తెలివితో మన కష్టంతో మన రక్తాన్ని చెమటగా మార్చి పని చేసుకుని కళ్ళామ్మ తల్లి సేవలో ఉన్న మనందరం గ్రేట్ ఆంధ్రను బహిష్కరిద్దాం. వాడికి ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు. మన రివ్యూలు రాస్తే మన మీద తప్పుగా రాస్తే మన గురించి చౌకగా చీపుగా రాస్తే వాడి అంతు నేను చూస్తా. వాడు రాజకీయాల్లో ఎన్ని అయినా చేసుకోమను మనకు సంబంధం లేదు. సినిమా పరిశ్రమపై, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలపై, సినిమాని నమ్ముకుని బతుకుతున్న వాళ్లపై ఏమాత్రం రాసినా సహించేది లేదు. దయచేసి గ్రేట్ ఆంధ్రను బహిష్కరించండి. ఈ పచ్చని మల్లె తోటలో ఈ గంజాయి మొక్కను పీకేద్దాం. కళామతల్లిని స్మరించుకుందాం. కళామతల్లి నీడలో బ్రతుకుతూ, సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మన న్యూస్ ని గ్రేట్ ఆంధ్రకిస్తే మన తల్లిదండ్రులను, ఆత్మను మోసం చేసుకున్నట్టు. ఇలాంటి గ్రేట్ ఆంద్రాన్ని మనం బహిష్కరించకపోతే మనకు మనం మోసం చేసుకున్నట్టే. నువ్వు రాజకీయంలో ఎవరినైనా తిట్టుకో.. ఎవరినైనా కొట్టుకొ మాకు సంబంధం లేదు. కానీ సినిమా వాళ్ళ జోలికి వచ్చావా? వెంకీ నీ పెంకి పగులుద్ది’’ అంటూ గ్రేట్ ఆంధ్ర న్యూస్ ఛానల్‌ను టాగ్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు కొంత మంది సపోర్ట్ చేస్తుంటే మరికొంత మంది వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: పవిత్ర పర్ఫెక్ట్ గా ఉంది.. పిల్లలను కంటాం.. నరేశ్ కామెంట్స్ వైరల్

ఎస్పీ బాలుకు ఇచ్చిన మాట కోసం తేజ మూవీ ఒప్పుకున్నా : ఆర్. పి. పట్నాయక్

Advertisement

Next Story