త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నివేతా థామస్.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2024-06-24 14:07:54.0  )
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నివేతా థామస్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నివేదా థామస్ ‘జెంటిల్ మేన్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తర్వాత మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘జై లవ కుశ’ సినిమాలో కాస్త లావుగా కనిపించిన నివేదా.. తెలుగులో చివరగా రెజీనా కసాండ్రాతో ‘షాకిని డానికి’ మూవీ చేసింది. తర్వాత ఇప్పటి వరకు మరో మూవీ అనౌన్స్ చెయ్యని ఈ బ్యూటీ.. తాజాగా తన X ఖాతా ద్వారా ఓ పోస్ట్ పెట్టి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

అయితే.. కొద్ది రోజుల నుంచి నివేదా థామస్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను పంచుకోవడంతో పాటు.. హాట్ ఫొటో షూట్‌లతో రెచ్చిపోయేది. కానీ ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిపోయింది. అయితే.. సడెన్‌గా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘కొంత కాలం గడిచింది... కానీ.. చివరగా!’ అంటూ ల‌వ్ ఎమోజీని జ‌త చేసింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. ‘నివేదా పెళ్లి చేసుకోబోతుందా.. లేక లవ్‌లో పడిందా’ అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. ‘మూవీ అప్‌డేట్ అయ్యింటుంది’ అంటూ మరికొందరు రిప్లైలు ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed