- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nivetha Thomas : పెళ్లి చేసుకోబోతున్న నివేదా థామస్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ
దిశ, సినిమా: నివేదా థామస్ ‘జెంటిల్ మేన్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘నిన్ను కోరి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తర్వాత మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘జై లవ కుశ’ మూవీలో కాస్త లావుగా కనిపించిన నివేదా.. తెలుగులో చివరగా రెజీనా కసాండ్రాతో ‘షాకిని డాకిని’ మూవీ చేసింది. తర్వాత ఇప్పటి వరకు మరో మూవీ అనౌన్స్ చెయ్యని ఈ బ్యూటీ.. తాజాగా X ఖాతా ద్వారా ఓ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
‘కొంత కాలం గడిచింది.. కానీ.. చివరగా!’ అంటూ లవ్ ఎమోజీని జత చేసి పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌తో నివేదా థామస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి చేసుకోబోతుంది అంటూ నెట్టింట వార్తలు వైరల్ చేశారు. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ.. ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అని కొత్త సినిమాను ప్రకటించింది నివేదా. దీంతో ఆమె పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. కాగా.. ‘35 - ఇది చిన్న కథ కాదు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రానా దగ్గుబాటి నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.
- Tags
- Nivetha Thomas