చిరు లాంచ్‌ చేసిన నితిన్‌-రష్మికల కొత్త సినిమా!

by sudharani |   ( Updated:2023-03-25 11:53:59.0  )
చిరు లాంచ్‌ చేసిన నితిన్‌-రష్మికల కొత్త సినిమా!
X

దిశ, సినిమా: నితిన్, రష్మిక మందన ప్రధానపాత్రల్లో వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న సినిమా ‘#VNRTrio’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టగా, డైరెక్టర్ బాబీ కెమెరా స్విచాన్ చేశారు.

గోపీచంద్ మలినేని తొలి షాట్‌‌కు దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సన స్క్రిప్ట్‌‌ని మేకర్స్‌‌కి అందజేశారు. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా.. ప్రేకకుల్లో సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇక వినోదాత్మకమైన ఈ చిత్రం మరింత అడ్వెంచరస్‌గా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలపగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story