Karthikeya-3 : నిఖిల్ ‘కార్తికేయ 3’ కసరత్తులు మొదలుపెట్టిన చందు మొండేటి?

by samatah |   ( Updated:2023-08-09 08:12:23.0  )
Karthikeya-3  : నిఖిల్ ‘కార్తికేయ 3’ కసరత్తులు మొదలుపెట్టిన చందు మొండేటి?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రెండు చిత్రాలు ‘కార్తికేయ’, ‘కార్తికేయ2’ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ‘కార్తికేయ 2’ చివర్లో ‘కార్తికేయ 3’కూడా ఉంటుందనే క్లూ చూపించింది మూవీ టీం. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా ఈ పార్ట్3 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు చందు మొండేటి నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా రెంజ్‌లో ప్లాన్ చేశారు. దీంతో నాగ చైతన్య సినిమా పూర్తికాగానే చందు ‘కార్తికేయ 3’ చేస్తారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం చందు ఈ ‘కార్తికేయ 3’కి సంబంధించిన కథ కూడా సిద్ధం చేస్తున్నారట.

Read More : ‘ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదే.. కానీ చిరంజీవి పిచ్చుక కాదు’

Advertisement

Next Story