Niharika: చరణ్, క్లిన్‌కారాపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వరల్డ్ లోనే బెస్ట్ అంటూ

by Kavitha |
Niharika: చరణ్, క్లిన్‌కారాపై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వరల్డ్ లోనే బెస్ట్ అంటూ
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే. ఈమె కేవలం నటిగా కాకుండా యాంకర్‌గా, నిర్మాతగా కూడా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా నిర్మించిన ఫస్ట్ మూవీ ‘కమిటీ కుర్రాళ్లు’. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అక్కడ ఆమె చరణ్, మెగా ప్రిన్సెస్ క్లీన్‌కారా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “కారా మా అందరికీ గోల్డెన్ డార్లింగ్. మా చరణ్ అన్నని మాత్రం ముప్పు తిప్పలు పెడుతుంది. ఆమెకు ఫుడ్ తినిపించడానికి చాలా కష్టాలు పడాలి. చరణ్ అన్నే అన్ని చూపిస్తూ తినిపిస్తారు. నేను చూసిన ఫాదర్స్‌లో చరణ్ అన్న బెస్ట్ ఫాదర్. స్టార్ హీరోగా బిజీగా ఉన్నా కారాతో కలిసి ఉండటానికి టైం ఇస్తాడు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా పాపతో గడపడానికి టైం సెట్ చేసుకుంటాడు. అసలు చరణ్ అన్నని అలా చూస్తే ఏ పని పాట లేక ఖాళీగా ఉండి పాప దగ్గర ఉంటున్నాడేమో అనిపిస్తుంది అని నిహారిక చెప్పుకొచ్చింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా.. ఇప్పటికే బెస్ట్ కొడుకుగా, హీరోగా, భర్తగా సక్సెస్ అయిన రామ్ చరణ్ ఇప్పుడు ఫాదర్‌గా కూడా సక్సెస్ అవుతున్నాడు అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

Advertisement

Next Story