Hari Hara Veera Mallu : బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన Nidhi Agarwal.. కల నెరవేరిందంటూ

by Prasanna |   ( Updated:2023-07-17 07:56:20.0  )
Hari Hara Veera Mallu : బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన Nidhi Agarwal.. కల నెరవేరిందంటూ
X

దిశ, సినిమా: స్టార్ నటి నిధి అగర్వాల్ తన అప్ కమింగ్ మూవీ ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో అవకాశం లభించడం ఆనందంగా ఉందని, పవన్‌తో నటించాలనే కల నేరవేరిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ హీరోతో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. ‘సినిమాలో ఇది నా మొదటి సన్నివేశం. ఆయనతో పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. అద్భుతమైన చిత్ర బృందంతో కలిసి పనిచేసే అవకాశ లభించడం ఒక రకంగా నా అదృష్టంగానే భావిస్తు్న్నా. నేను చెప్పేది నమ్మండి. తొందరలోనే మీరు థియేటర్లో ఓ అద్భుతాన్ని చూస్తారు. ముఖ్యంగా పవన్, క్రిష్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్టులో రాసుకొచ్చింది. ఇక దీనిపై స్పందింస్తున్న పవన్ ఫ్యాన్స్ ఇన్నాళ్లకు ఓ అప్‌డేట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ నటిని పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: పవన్ ‘BRO’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

Read more : పవన్ ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

Advertisement

Next Story