సినిమాల్లోకి రాకపోతే ఆ పనే చేసేదాన్ని : నిధి అగర్వాల్

by sudharani |
సినిమాల్లోకి రాకపోతే ఆ పనే చేసేదాన్ని : నిధి అగర్వాల్
X

దిశ, సినిమా : అందాల తార నిధి అగర్వాల్.. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించనందుకు అసంతృప్తిగా ఉందంటోంది. 'సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. తనకు అందం ఉన్నా అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయిందని వాపోయింది. ఇక సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిధి.. తాజాగా అభిమానులతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉందన్న ఆమె.. ఆశలన్నీ పవన్ సినిమాపైనే ఉన్నాయని చెప్పింది. అంతేకాదు తాను సినిమాల్లోకి రాకపోయుంటే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదాన్నని, వర్కవుట్స్ చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని తెలిపింది. అలాగే ఇంటర్‌లో అథ్లెటిక్స్‌లో స్టేట్ ఛాంపియన్‌గా నిలిచానన్న బ్యూటీ.. ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టకపోతే కొంతకాలం ఏదో ఒక ఉద్యోగం చేసి ఫైన‌ల్‌గా ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించేదాన్నంటూ వివరించింది.

Advertisement

Next Story