నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారా..?

by sudharani |   ( Updated:2022-09-08 08:28:27.0  )
నాగార్జున రాజకీయాల్లోకి రాబోతున్నారా..?
X

దిశ, సినిమా : టాలీవుడ్ కింగ్ నాగార్జున రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటారని తెలిసిందే. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు విజయవాడ ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే నాగ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది సందేహం? ప్రచారంలో ఉన్న వార్తలను బట్టి ఆయన వైసీపీలో చేరనున్నారనే గుసుగుసలు వినిపిస్తుండగా.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దింపాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని టాక్. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడలేదు. నిజానికి నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. వైఎస్ కుటుంబానికి తన సపోర్ట్ ఉంటుందని నాగార్జున అప్పుడప్పుడు హింట్ ఇస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో కింగ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందో లేదో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Also Read : చిరంజీవి vs నాగార్జున.. గెలుపెవరిది?

మరోసారి హాట్ టాపిక్ గా జేపీ నడ్డా-నితిన్ భేటీ వార్త.. పాపం అంటున్న నెటిజన్స్

Advertisement

Next Story