- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara: 'దేవర' న్యూ వెర్షన్ కొత్త సీన్స్ కూడా.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
దిశ , వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర' పార్ట్ 1 సెప్టెంబర్ 27న ఆడియెన్స్ ముందుకొచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా కావడంతో చాలా మంది సినిమా థియేటర్స్ కు వెళ్లి చూసారు. మిక్స్డ్ టాక్ తో రన్ అయినా అదిరి పోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ‘దేవర’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కొంచం స్లో అయినా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలించింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.396 కోట్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి 'దావూదీ' అనే పాటను చిత్రయూనిట్ తొలగించిన విషయం మనకీ తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా 2 నిమిషాల వీడియో వెర్షన్ ను వదిలితే.. తారక్, జాన్వీ వేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
దాంతో, థియేటర్లలో ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందనే ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఈ పాటకి సరైన ప్లేస్ మెంట్ దొరకకపోవడంతో మూవీ టీమ్ యాడ్ చేయలేదు. అయితే, తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ పాటతో పాటు కొత్త సీన్స్ కూడా థియేట్రికల్ వెర్షన్‌లో ఈ రోజు నుంచి యాడ్ చేయబోతున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.