Umair Sandhu : సెలబ్రిటీల ఇళ్లల్లో చిచ్చులు పెట్టి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..!

by sudharani |   ( Updated:2023-06-30 15:08:35.0  )
Umair Sandhu : సెలబ్రిటీల ఇళ్లల్లో చిచ్చులు పెట్టి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమైర్ సంధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఇతడు.. ఇండస్ట్రీకి చెందిన వాళ్లపై ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. సంబంధం లేని వాళ్లకు కూడా.. వాళ్లు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ రిలేషన్‌లో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు షేర్ చేస్తాడు. దీంతో వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.

ఈ క్రమంలో.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రోజున పవన్ కళ్యాణ్ ఫుల్‌గా మద్యం సేవించి వచ్చాడంటూ సంచలనం సృష్టించాడు. ఇదిలా ఉంటే.. అందరి లైఫ్‌లో చిచ్చులు పెట్టినప్పటికీ తన లైఫ్ మాత్రం బిందాస్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు ఉమైర్. తాజాగా స్విమింగ్ ఫుల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సెలబ్రిటీల ఇళ్లల్లో గొడవలు పెట్టి వీడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

Advertisement

Next Story