ఏడు నెలల కడుపుతో పబ్‌లో ఇదేం పని.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు (వీడియో)

by sudharani |   ( Updated:2024-03-15 13:49:58.0  )
ఏడు నెలల కడుపుతో పబ్‌లో ఇదేం పని.. హీరోయిన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: అమలాపాల్ ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘నాయక్, ఇద్దరమ్మాయిలతో’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక భాషతో సంబంధం లేకుండా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో కూడా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. అప్పట్లో దర్శకుడు ఎఎల్ విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల చేత చట్టబద్ధంగా అతడి నుంచి విడిపోయిన ఈ అమ్మడు.. ఇటీవల జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు ప్రస్తుతం అమలా పాల్ ఏడో నెల ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ఈ అమ్మడు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటోంది.

అమలా పాల్ తాజాగా తన భర్తతో కలిసి పబ్‌లో డ్యాన్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నాకు 7 నెల నటుస్తుంది. కాబట్టి మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ అందరి ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. కొంత మంది పాజిటివ్‌గా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏడో నెలలో ఇలా పబ్‌లో డ్యాన్సులు చెయ్యడం అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story