ఇంత చల్లటి వాతావరణంలోనూ వేడి పుట్టిస్తున్న నేహా శెట్టి.. ‘సమ్మోహనుడా’ సాంగ్‌లో అందాల ఆరబోత

by sudharani |   ( Updated:2023-10-18 05:43:15.0  )
ఇంత చల్లటి వాతావరణంలోనూ వేడి పుట్టిస్తున్న నేహా శెట్టి.. ‘సమ్మోహనుడా’ సాంగ్‌లో అందాల ఆరబోత
X

దిశ, సినిమా : ‘డీజే టిల్లు’లో రాధిక క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయిన నేహా శెట్టి.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ సినిమాతో ఆడియన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘సమ్మోహనుడా’ సాంగ్ రిలీజ్ కాగా.. నేహా అందాలకు ఫిదా అవుతున్నారు సింగిల్ బాయ్స్. ఇంత కూల్ వెదర్‌లోనూ వేడి పుట్టిస్తుందని కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతుండగా.. శ్రీయా ఘోషల్ వోకల్స్‌తో సాంగ్‌ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందనడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు. మ్యూజిక్, లిరిక్స్ అన్నీ అదిరిపోగా.. క్యాచీ వర్డ్స్‌తో శ్రీయ పాడిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed