నా సినీ కెరీర్‌లో అదో చెత్త సినిమా.. సూర్య మూవీపై నయనతార షాకింగ్ కామెంట్స్

by sudharani |
నా సినీ కెరీర్‌లో అదో చెత్త సినిమా.. సూర్య మూవీపై నయనతార షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతుంది నయనతార. ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో బిజీగా ఉంది. కోలివుడ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గీత మోహన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్.. తన సినీ కెరీర్‌లోనే ‘గజినీ’ సినిమా అంటే అస్సలు నచ్చదు అని చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. ‘గజినీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ.. నా సినీ కెరీర్‌లో నేను ఎంచుకున్న చెత్త సినిమా అది. నేను నటించిన అన్ని మూవీస్ నాకు నచ్చితాయి. గజినీ సినిమా మాత్రం నాకు నచ్చుదు. ఎందుకంటే.. అందులో నా పాత్రను చెప్పినట్లుగా చిత్రీకరించలేదు. నన్ను అంత మంచిగా చూపించలేదు. ఇక లెర్నింగ్ ప్రాసెస్‌ కాబట్టి నేను కూడా లైట్ తీసుకున్న’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. సూర్య, ఆసిన్ జంటగా నటించిన ‘గజినీ’ మూవీలో నయనతార కీలక రోల్‌లో కనిపించింది.



Next Story