మదర్స్ డే రోజున మొదటిసారి తమ పిల్లల ముఖం చూపించిన నయన్-విఘ్నేష్

by Anjali |   ( Updated:2023-05-15 07:28:01.0  )
మదర్స్ డే రోజున మొదటిసారి తమ పిల్లల ముఖం చూపించిన నయన్-విఘ్నేష్
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకుడు విఘ్నేష్‌‌ను ప్రేమ వివాహం చేసుకొని, సరోగసి విధానం ద్వారా ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వారికి ఉయిర్, ఉలగ్ అనే నామకరణం కూడా చేశారు. కానీ ఇప్పటి వరకు వారి ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టలేదు. నిన్న(మే 14న)మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్.. నయనతార తన పిల్లల్ని ఇద్దరిని ఒల్లో కూర్చోబెట్టుకున్న క్యూట్ పిక్స్‌ను నెట్టింట షేర్ చేసి.. ‘‘ ప్రపంచంలోనే నీవు ఉత్తమమైన తల్లివి, అమ్మగా నీకు 10కి పది మార్కులు వేయాలి. ఆ దేవుడు నీకు మరింత శక్తిని ప్రసాదించాలి. పిల్లలతో మన కల తీరింది. హ్యపీ మదర్స్ డే’’ అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

Read More: Akhil Akkineni: సినిమా ఫ్లాప్ అయినా.. తగ్గేదేలే అంటున్న అఖిల్

సంతోష్ శోభన్‌లో ‘నన్ను నేను చూసుకున్నా’నంటున్న నాని !




Also read: తొలిసారి కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్..

Advertisement

Next Story