ప్రపంచ యాత్రికుడిని దింపేసిన నవీన్ పోలిశెట్టి .. ఆటగాళ్లందరికీ నేను చెప్పేదేంటంటే.. ?

by Prasanna |   ( Updated:2023-10-16 07:26:02.0  )
ప్రపంచ యాత్రికుడిని దింపేసిన నవీన్ పోలిశెట్టి .. ఆటగాళ్లందరికీ నేను చెప్పేదేంటంటే..  ?
X

దిశ,వెబ్ డెస్క్: నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను పెట్టే వీడియోస్ గంటల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్తాయి. ప్రపంచ విడ్డూరాలు అంటూ ఎన్నో వింతలు, విశేషాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులకు చూపించాడు. అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ యూట్యూబర్‌గా అన్వేష్ పేరు పొందాడు. తాజాగా ఈ తెలుగు యూట్యూబర్‌‌ను హీరో నవీన్ పోలిశెట్టి ఇమిటేట్ చేశాడు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ "నా అన్వేషణ.. ప్రపంచ యాత్రికుడు.. ఎవర్రా మీరంతా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నవీన్.

"ఫ్రెండ్స్ మనం ఈ రోజు లాస్ ఏంజెల్స్‌కి వచ్చేశాం.. ఆటగాళ్లందరికీ నేను చెప్పేది ఏంటంటే.. చదువుకోండిరా బాబూ ఫస్ట్.. మంచి ఆటగాళ్లే అంతా ఆ మంచి ఆటగాళ్లు.. మీరు కూడా నాకు లాగా లాస్ ఏంజెల్స్ రావాలంటే చదువుకోండిరా బాబూ ఫస్ట్.. గుంటలందరూ ఈ మధ్య పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోవాలనుకుంటున్నార్రా.. ఆటగాళ్లందరికీ నేను చెప్పేదేంటంటే.. మీరు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా చూస్తే మీరు ఏ పిచ్‌లో ఆడాల్సిన పరిస్థితి లేకుండా కప్‌లో ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసేయండ్రా ముందు.. అమ్మనాన్నలకు ఫ్యాన్స్ అవండ్రా ఫస్ట్.. చదువుకోండ్రా బాబూ ముందు.." అంటూ ఫన్నీగా నవ్వించాడు.

Click Here for Naveen Polishetty twitter video

Advertisement

Next Story

Most Viewed