- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేం విడ్డూరం: వడ్డాణం చేయించుకున్న నవీన్ పొలిశెట్టి
దిశ, సినిమా: నవీన్ పొలిశెట్టి హీరోగా కళ్యాణ్ శంకర్ మొదటిసారి దర్శకుడిగా పరిచమవుతున్న మూవీ 'అనగనగా ఒకరాజు'. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో నానా హంగామా చేసిన నవీన్ పొలిశెట్టి.. 'నాయుడుగారు హనీమూన్‌కి హవాయికి టికెట్స్ బుక్ చేశారా లేదా? డబ్బుల గురించి ఆలోచించకండి? రాజు గాడి పెళ్లి ఇక్కడ! పారిజాతం అత్తయ్య.. రేయ్ అత్తయ్య గారు వచ్చారు ఏసీ ఆన్ చేయండ్రా' అంటూ తన బంగారాన్ని చూపిస్తూ బిల్డప్ ఇస్తుంటాడు. అంతేకాదు 'ఇదేం విడ్డూరం ఆడవాళ్లకేనా వడ్డాణం.. నేను కూడా మామకు చెప్పి డబ్ల్యుడబ్ల్యుయఫ్ లాంటిది ఐదు కిలోల బంగారు వడ్డాణం చేయించాను. మన ఫోటోలు చూసి ఆ కత్రినా కైఫ్, విక్కి కౌశల్ కుళ్లుకుని చావాలా. అలా తియ్యి నువ్వు ఫోటోలు. దీనికి రాజు ఈటింగ్ కాజు అని కాప్షన్ ఏసుకోరా..!' అంటూ ఫ్రెండ్స్‌కు చెప్పే స్టైల్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది. ఇక త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవనుండగా.. పి.డి.వి ప్రసాద్ సమర్పణలో 'సితార ఎంటర్ టైన్మెంట్స్', ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
https://youtu.be/KwbOx87Uuf8