అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు.. జక్కన్నపై నాని ప్రశంసలు

by Vinod kumar |
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు.. జక్కన్నపై నాని ప్రశంసలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిపై నేచురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ‘దసరా’ మూవీ ప్రమెషన్స్‌లో భాగంగా ముంబై వెళ్లిన హీరో తాజా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పాడు. ‘భారతీయ సినిమా అనగానే అందరూ దక్షిణాదివైపే చేసేలా చేశారు రాజమౌళి. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు.

తన సినిమాలో ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకే వస్తాయి. చాలామంది చేయలేని పనులను ఆయన విజయవంతం చేసి చూపిస్తాడు. అందుకే ఆయనొక దార్శనికుడు. ‘నాటు నాటు’ పాట ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. భారతీయ సినిమాలు ప్రత్యేకమైనవిగా నిరూపించింది. ఇది ఆరంభం మాత్రమే’ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను పొగిడేశాడు. ఇక ఆయన నటించిన ‘దసరా’ మార్చి 30న విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed