- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరేశ్ మూడో భార్యకు షాకిచ్చిన కోర్టు.. ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని కామెంట్!
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్ కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ జంట తమ బంధంలో జరిగిన విషయాలను వెండితెరపైకి తీసుకురావడం ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. మీడియా ముందు వీరిద్దరి రిలేషన్ బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీంతో నరేష్ మూడో భార్య మీడియా ముందు రచ్చ రచ్చ చేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్రను నెగిటివ్‌గా చూపించారని తన పరువు, ప్రతిష్ట దెబ్బతింటుందని, దీంతో ఆ మూవీని ఓటీటీలోకి రాకుండా ఆపేయాలని కోర్టులో పిటిషన్ వేసింది. అయితే తాజాగా కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్య రఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, సాక్షం న్యాయపరంగా నిలకడగా లేనందున కేసు కొట్టివేస్తూ నిన్న (ఆగస్టు1)కోర్టు తీర్పును చెప్పింది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా, ఈ మూవీ కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన అనంతరం సినిమా రిలీజ్‌ను ప్రైవేటు వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది. ఇక నరేష్-పవిత్రను అడ్డుకునే వారే లేరంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.