- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయటపడిన నాని సీక్రెట్ లవ్ లవ్ స్టోరీ..
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని త్వరలో ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి పాట జనాలకు కనెక్ట్ అయింది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలోనే తాజాగా నాని కాలేజీ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇందులో భాగంగా స్టూడెంట్స్ నానిని ఫన్నీ క్వశ్చన్స్ అడిగారు. ఈ క్రమంలో ‘మీ కాలేజ్ లవ్ గురించి చెప్పండి?' అని అడగగా నాని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ‘ కాలేజీలో ప్రతి ఒక్కరికి వన్ సైడ్ లవ్ లేదా టూ సైడ్స్ లవ్ అనేవి ఉంటాయి. కానీ అసలు విషయం ఏమిటంటే నాకు కాలేజ్ డేస్ లో ఎలాంటి ప్రేమాయణాలు లేవు. నన్ను ప్రేమ విషయంలో కదిలించేంత అమ్మాయి మాత్రం కనిపించలేదు. లవ్ చేసే అంత సీన్ కూడా మాకు లేదనుకొండి ’ అంటూ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు నాని. ప్రస్తుతం నాని మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.