Dasara Movie: దసరా సినిమా ప్రమోషన్స్‌కు సిద్దమవుతున్న నాని

by Prasanna |   ( Updated:2023-02-25 03:27:25.0  )
Dasara Movie: దసరా  సినిమా ప్రమోషన్స్‌కు సిద్దమవుతున్న నాని
X

దిశ,వెబ్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని ఈ సారి మాస్ ఆడియన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దసరా సినిమాలో నాని మేక్ ఓవర్ చూడగానే అభిమానులకు పిచ్చెక్కి పోయింది. ఇక టిజర్ చూసిన తరువాత సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. నానీ ఎలివేషన్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ , కేజీఎఫ్ , కాంతార లాగే దసరా సినిమా వుంటుంది అని అంటున్నారు.

దీంతో దసరా కోసం వేచి చేస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం. మార్చి 30 న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌కు కొత్తగా పరిచయమయ్యిన శ్రీకాంత్ డైరెక్షన్ అదిరిపోయిందంటూ.. ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర పతాకంపై సుధాకర్ చెరుకూరి సినిమా నిర్మిస్తున్నారు.

నానీ సినీ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ నానికి మించి ఊర మాస్‌గా కనిపించబోతుంది.త్వరలోనే వెన్నెలకి సంబందిందించిన ప్రోమో రిలీజ్ చేయనున్నారు. ఇవన్ని దసరాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో నానీ ట్విట్టర్, ఇంస్టా ప్రొఫైల్ ఫోటోను కూడా కూడా మార్చేశాడు. దసరా సినిమా లోని మాస్ లుక్‌‌ను DP గా పెట్టుకున్నాడు. దసరా ప్రమోషన్స్ మాత్రం ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నానీ ఊర మాస్ గా పాత్రలో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Advertisement

Next Story