Nani: మరోసారి అయ్యప్ప మాలలో ఆకట్టుకుంటోన్న నాని!

by Anjali |   ( Updated:2024-09-15 14:50:08.0  )
Nani: మరోసారి అయ్యప్ప మాలలో ఆకట్టుకుంటోన్న నాని!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికీ సెలబ్రిటీలు కూడా మాల వేసుకునేవాళ్లను చూస్తూనే ఉంటాం. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరు నుంచి యంగ్ హీరోల వరకు ఎంతో మంది కుదిరిన ప్రతిసారి అయ్యప్ప మాల వేసుకుని కనిపిస్తారు. ప్రస్తుతం భక్తులంతా అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. కాగా ఈ క్రమంలో హీరో నాని కూడా తాజాగా అయ్యప్ప మాలలో కనిపించి ఆకట్టుకుంటున్నారు. నేచురల్ స్టార్ గతంలో కూడా అయ్యప్ప మాల వేసుకున్న విషయం తెలిసిందే. శబరికి వెళ్లిన ఫొటోలు, వీడియోలు, పూజలు చేసిన ఫొటోలు చాలా సార్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే తాజాగా నాని దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని అయ్యప్ప మాలలో హాజరయ్యారు. గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాలలో అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని అయ్యప్ప మాలలో ఈవెంట్ కు హాజరవ్వడంతో ఫ్యాన్స్, నెటిజన్లు నానిని అభినందిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. దసరా, హాయ్ నాన్న వంటి బ్లాక్ బస్టర్ హిట్లర్ తన ఖాతాలో వేసుకున్న నాని.. ఇటీవల తెరకెక్కిన సరిపోదా శనివారం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్‌గా నటించారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఇక సరిపోదా శనివారం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed