డైరెక్టర్ టైమ్ వేస్ట్ చేసిన కీర్తి సురేశ్

by sudharani |
డైరెక్టర్ టైమ్ వేస్ట్ చేసిన కీర్తి సురేశ్
X

దిశ, సినిమా : ‘దసరా’ సినిమాలో నేచురల్ స్టార్ నానితో మరోసారి జోడి కట్టింది కీర్తి సురేశ్. మార్చి 30న మూవీ రిలీజ్ కాబోతుండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తెలంగాణ నేపథ్యంలో ఊర మాస్ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమాలో కీర్తి కీ రోల్ ప్లే చేసిందని ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు నాని.

‘ఫస్ట్ టైమ్ డెరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పేందుకు ఆమెను కలిశాడు. అయితే ఆయన తెలంగాణ యాసలో మూడు గంటలు స్టోరీ చెప్పడంతో ఆమెకు అర్థం కాలేదు. తెలుగు ప్రోపర్‌గా అర్థం చేసుకునే కీర్తికి.. తెలంగాణ యాస అర్థం కాలేదని, దీంతో ట్రాన్స్‌లేటర్ సహాయంతో మరోసారి కథ వినిపించాల్సి వచ్చింది. స్టోరీ అర్థమయ్యాక ఎగ్జయిట్మెంట్ ఫీల్ అయిన ఆమె వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెన్నెల పాత్రలో కీర్తి స్థానంలో మరొకరిని ఊహించుకోలేనంతగా నటించింది’ అని ప్రశంసించాడు.

Advertisement

Next Story