- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పుడు ఆ విషయం చెబితే పోలీసులు కేసు బుక్ చేస్తారు: Nandamuri Balakrishna
దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. వారం రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి బాలయ్య సత్తా ఏంటో చూపించారు. ఈ నేపథ్యంలో ఆదివారం వీరసింహారెడ్డి చిత్ర విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించి చాలా కాలమైందని గుర్తు చేసుకున్నారు. 'నా తండ్రి, నా దైవం, నా గురువు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా నా చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉంది.' అని అన్నారు. తన సమరసింహారెడ్డి సినిమా సమయంలో టికెట్ల కోసం డైెరెక్టర్ గోపిచంద్ మలినేని తిన్న దెబ్బలను గుర్తుచేశారు. ఆరోజు ఎందుకు దెబ్బలు తిన్నాడో చెబితే ఇప్పుడు ఆయన కేసు బుక్ చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.