స్విమ్ సూట్‌లో దర్శనమిచ్చిన నమ్రతా శిరోద్కర్.. పాపం మహేశ్ అన్న చూస్తే ఏమైపోతాడో ఏమో (వీడియో)

by sudharani |   ( Updated:2024-05-02 14:31:34.0  )
స్విమ్ సూట్‌లో దర్శనమిచ్చిన నమ్రతా శిరోద్కర్.. పాపం మహేశ్ అన్న చూస్తే ఏమైపోతాడో ఏమో (వీడియో)
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేశ్ బాబు ‘వంశీ’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తర్వాత ‘అంజి, టక్కరి దొంగ’ సినిమాలు మాత్రమే చేసింది. ఇక వంశీ చిత్రం టైంలోనే మహేశ్‌తో ప్రేమలో పడిన నమ్రత.. అతడిని పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమాలకు దూరం అయింది. అప్పటి నుంచి ఫ్యామిలీ లైఫ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ.. కుటుంభాన్ని చూసుకుంటూ ఉంటోంది. అంతే కాకండా నమ్రత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. సంప్రదయ దుస్తుల్లోనే ఎక్కవగా దర్శనమిస్తుటుంది. అలాంటిది నమ్రతకు సంబంధించిన ఓ స్విమ్ సూట్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

నమ్రత హీరోయిన్‌గానే కాకుండా.. 1993లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు మిస్‌ ఇండియా యూనివర్స్ పోటీల్లో నమ్రత పాల్గొన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో నమ్రత నాజూకు అందాలతో ఆకట్టుకోవడమే కాకుండా.. క్యూట్‌గా క్యాట్ వాక్ చేస్తూ వస్తుంది. ఇందులో స్విమ్ సూట్ లాంటి డ్రెస్ ధరించింది. ఈ అరుదైన వీడియో బయటకు వచ్చి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నమ్రత, మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషిస్తుంటే.. మరి కొందరూ మాత్రం ఇప్పుడు ఆ వీడియో చూస్తే.. ‘పాపం మా మహేశ్ అన్న ఏమైపోతాడో’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

శ్రీదేవి, జాన్వి అభిమానులకు స్వీట్ న్యూస్.. వారి ఇంట్లో ఒక్కరోజు ఉండే ఛాన్స్.. ఈ ఆఫర్ మిస్ అవొద్దు..

Advertisement

Next Story

Most Viewed