ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై నాగార్జున రివ్యూ.. ఆసక్తికర పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-06-29 08:05:59.0  )
ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై నాగార్జున రివ్యూ.. ఆసక్తికర పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడి’ సినిమా మానియా కొనసాగుతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులనే కాకుండా సినీ సెలబ్రిటీలను మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో చూపించిన విజువల్స్, యాక్షన్స్, నటీనటుల పాత్రలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే కల్కి సినిమా వరల్డ్ వైడ్‌గా జూన్ 27న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ స్టార్స్ రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కల్కి సినిమాపై రివ్యూ ఇస్తూ x వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘‘సూపర్ డూపర్ కల్కి2898ఏడి టీమ్‌కి అభినందనలు!! నాగి మీరు మమ్మల్ని మరొక సమయానికి, మరొక ప్రదేశానికి తీసుకెళ్లారు. పురాణాలు, చరిత్రను చాలా అద్భుతంగా చూపించారు!! అసలైన మాస్ హీరో అమితాబ్ జీ.. సార్ మీరు నిప్పులు కురిపిస్తున్నారు. సీక్వెల్‌లో కమల్‌జీని చూడడానికి ఆగలేను. అతనికి సరిపోలేదు! ప్రభాస్ నువ్వు మళ్ళీ చేసావు!! దీపికా జీ మీరు దివ్యమైన తల్లిలా చాలా అద్భుతంగా కన్విన్సింగ్‌గా నటించారు!! మిగిలిన టీమ్ అశ్విని దత్ గారు, ప్రియమైన స్వీటీ, స్వప్నా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు! ఇండియన్ సినిమా మళ్లీ అద్భుతం చేసింది!!’’ అని రాసుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed