- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు అనుష్క శెట్టితో ఎఫైర్‌పై స్పందించిన నాగార్జున.. నాతోపాటు నా కొడుకు కూడా లింకులు అంటూ
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్, ఆర్టిస్ట్‌లపై రకరకాల గాసిప్స్ ఎప్పుడూ ప్రచారంలో ఉంటూనే ఉంటాయి. హీరోహీరోయిన్లు కాస్తంత క్లోజ్‌గా ఉంటే చాలు ఏదో ఒక ఎఫైర్ అంటగట్టేస్తుంటారు పుకారు రాయుళ్లు. నాగార్జున సైతం తొలినాళ్లలో చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ రకరకాల పుకార్లు షికార్లు కొట్టాయి. దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మితో నాగార్జున వైవాహిక జీవితం, విడాకులు నేపథ్యంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇక తర్వాతి కాలంలో టబు , శ్రీయా , మనీషా కొయిరాలా, పూజా బాత్రా, అనుష్క శెట్టిలతో నాగార్జునకు సంబంధాలు అంటగట్టారు. కాలం గడిచే కొద్ది ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడకపోగా.. నాగ్ విషయంలో ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అనుష్కతో నాగార్జున డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చేవి. అయితే వీటిపై తాజాగా నాగార్జున స్పందించారు.
రీసెంట్‌గా నాగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే నాగార్జునకు హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి యాంకర్ ప్రశ్నించారు. అప్పడు నాగ్ మాట్లాడుతూ.. స్వతహాగా తాను చాలా హైట్‌గా ఉంటానని, అలాంటిది తన పక్కన పొట్టిగా ఉన్న అమ్మాయిల కంటే హైట్‌గా ఉండేవాళ్లే బాగుంటారని.. అందుకే దర్శక నిర్మాతలకు పొడుగ్గా ఉండే హీరోయిన్లను తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటానని చెప్పారు నాగార్జున. ఆ క్రమంలోనే జోడీ బాగుంటుందని అనుష్కనే రిపీట్ చేసేవాడినని నాగ్ తెలిపారు. అలాంటిది నాకు అనుష్కకు మధ్య లేనిపోనివి అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే తనతోనే కాకుండా తన కుమారుడు నాగచైతన్యకు అనుష్కకు మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేస్తున్నారని నాగ్ ఫైర్ అయ్యారు. సమాజం పాడైపోతోందని.. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారని.. చైతూ కంటే అనుష్క వయసులో పెద్దవారని , దీనికి తోడు అతని కంటే కూడా హైట్ అని .. మరి ఎలా సెట్ అవుతుందని ఇలాంటి రాతలు రాస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.