- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోగా నిలిచిన Nagarjuna.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
దిశ,వెబ్ డెస్క్: సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఆ నటుడు ఎవరో కాదండి? అక్కినేని నాగార్జున. ఈ మన్మధుడికి సౌత్ ఇండస్ట్రీలో రూ.3 వేల కోట్లకు పైగా నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా, దక్షిణాదిలోనే రిచెస్ట్ హీరోగా నిలిచారు.
తాజా నివేదికల ప్రకారం నాగార్జున ఆస్తుల విలువ రూ.3 వేల కోట్లు దాటింది. సినిమాలే కాకుండా ఇతర వ్యాపారాల నుంచి కూడా నాగార్జున సంపాదిస్తున్నారు. జూమ్ టీవీ నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో నాగార్జున నికర విలువ రూ. 3010 కోట్లు. 63 ఏళ్ల కింగ్ నాగార్జున ఒక్కో సినిమాకి రూ. 9 నుండి రూ. 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇది మాత్రమే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం రూ. 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. అనేక వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టారు. ఒకప్పుడు నాగార్జున 'మా టీవీ'కి ఓనర్‌గా ఉండగా, ఆ తర్వాత దానిని 'స్టార్ మా'కి అమ్మేశారు. తన తండ్రి నాగేశ్వరరావు ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జున కూడా ఒక భాగస్వామి. ఇలా అన్ని కలిపి మూడు వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన Samantha..(వీడియో) సినిమాలు ఒకే చేస్తుందా?