Nagababu-Niharika: పబ్లిక్‌లో నిహారిక పరువు తీసిన నాగబాబు.. ఏకీపారేస్తున్న నెటిజన్లు?

by Anjali |
Nagababu-Niharika: పబ్లిక్‌లో నిహారిక పరువు తీసిన నాగబాబు.. ఏకీపారేస్తున్న నెటిజన్లు?
X

దిశ, సినిమా: యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది మెగా డాటర్ నిహారిక. కానీ ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. తర్వాత సిద్ధు జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కానీ వీరి బంధం మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మెగా డాటర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. మొదటి సినిమాగా ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాకు నిర్మిస్తోంది. ఆగస్టు 9 వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో నిన్న(ఆగస్టు 5) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిహారిక ఫాదర్ నాగబాబు అటెంట్ అయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మూవీ గురించి మాట్లాడాక.. తర్వాత నిహారిక చిన్నప్పటి విషయాలు బయటపెట్టారు. నిహారిక మెగా ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అందరూ అల్లరి అమ్మాయి అని అంటుంటారు. కాగా నాగబాబు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిహారిక గురించి మాట్లాడుతూ.. ‘‘నిహారిక నా స్వీటెస్ట్ డాటర్. తను కొంచెం పెద్దగయ్యాక ఇండిపెండెంట్‌గా పడుకోమని చెప్పేవాడిని. కానీ తన మదర్ కిచెన్‌లోకి వెళ్లగానే మళ్లీ వచ్చి బెడ్‌లోకి వచ్చి నా షర్ట్‌లో దూరి బాగా అల్లరి చేసేది’’ అంటూ నాగబాబు అంతమందిలో నిహారిక చిలిపి చేష్టలు బయటపెట్టాడు. నాగబాబు ఈ విషయాలు చెబుతుండగా తన భార్య ఫేస్‌కు చేయి అడ్డుపెట్టుకుని కాస్త షేమ్‌గా ఫీల్ అయ్యారు. నాగబాబు కామెంట్స్ విన్న జనాలు.. నీ కూతురి గురించి నువ్వే పరువు తీసుకుంటున్నావ్. అలాంటి విషయాలు పబ్లిక్‌లో చెప్పొచ్చా? అంటూ నాగబాబును ఏకిపారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed