Divvela Madhuri:‘నాగచైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకోగా..నేను చేసుకుంటే తప్పేంటి?’.. దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్

by Anjali |
Divvela Madhuri:‘నాగచైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకోగా..నేను చేసుకుంటే తప్పేంటి?’.. దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి లవ్ ఎఫైర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. శ్రీనివాస్ భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా.. మాధురిని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకున్నాడని శ్రీనివాస్ కుమార్తె ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవలే శ్రీనివాస్ భార్య వాణి టెక్కలిలోనున్న తమ ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టింది. దీంతో శ్రీనివాస్ భార్య, కుమార్తెపై దాడి చేయడానికి సిద్ధపడ్డాడు. అంతేకాకుండా భార్య వాణిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో వాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం టెక్కలి నుంచి పలాసకు వెళ్తోన్న క్రమంలో దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. ఇకపోతే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి బయట తిరిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్, మంచి స్నేహితుడు అని దివ్వెల మాధురి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా మాధురి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

టాలీవుడ్ హీరో నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాళ్ల ఇటీవలే ఇరుకుంటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తనపై వస్తోన్న ట్రోల్స్‌పై స్పందించిన మాధురి.. హీరో నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదా? నేను రెండో పెళ్లి చేసుకుంటే చేసుకుంటే తప్పేముంది అంటూ మాట్లాడింది. ప్రస్తుతం దివ్వెల మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story