- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: రేసింగ్‌లోకి నాగచైతన్య.. ఏ టీమ్ కొనుగోలు చేశారంటే?
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ ‘తండేల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ పాన్ ఇండియా భాషలలో దాదాపు రూ. 75 కోట్లతో రూపొందిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నాగచెతన్య ఓ పక్కా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇప్పటికే ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే చైతుకి ఆటోమొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. అలాగే తనకు చిన్నప్పటి నుంచి కారు రేసింగ్ అంటే చాలా ఇష్టమని.. ఫార్ములావన్ అంటే పిచ్చని.. హైస్పీడ్ డ్రామాను కూడా ఎంజాయ్ చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు చైతన్య. ఇందులో భాగంగా తాజాగా తనకు ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగు పెట్టాడు అక్కినేని హీరో. ఈ మేరకు ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. దీంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఆధ్యర్యంలో జరిగే ఫార్ములా 4లో భాగమయ్యాడు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశాడు. కాగా.. ఈ సీజన్‌కు సంబంధించిన రేసులు ఈనెల 24 నుంచి స్టార్ట్ కానున్నాయి.